ఏపీలో డైకిన్ రూ.1000 కోట్ల పెట్టుబ‌డి.. శ్రీసిటీలో ఏసీల త‌యారీ యూనిట్‌

  • ఏసీల త‌యారీలో అగ్ర‌గామిగా డైకిన్‌
  • శ్రీసిటీలో ఉత్ప‌త్తి ప్లాంట్ ఏర్పాటు
  • రూ.1,000 కోట్ల పెట్టుబ‌డితో ప్లాంట్‌
  • 3 వేల మందికి ఉపాధి ల‌భించ‌నుంద‌న్న సాయిరెడ్డి
ఎయిర్ కండిషనర్ల త‌యారీలో ప్ర‌ముఖ సంస్థ‌గా పేరొందిన డైకిన్ ఏపీలో త‌న ఉత్ప‌త్తి ప్లాంట్‌కు శంకుస్థాప‌న చేసింది. రూ.1,000 కోట్ట పెట్టుబ‌డితో ఆ సంస్థ చిత్తూరు జిల్లా శ్రీసిటీలో త‌న ప్లాంట్‌ను ఏర్పాటు చేయ‌నుంది. ఈ ప్లాంట్‌లో డైకిన్ సంస్థ ఏడాదికి 15 ల‌క్ష‌ల ఏసీల‌తో పాటు కంప్రెస‌ర్లు, కంట్రోల‌ర్ బోర్డులు, ఇత‌ర విడిభాగాల‌ను త‌యారు చేయ‌నుంది.

ఈ ప‌రిశ్ర‌మ ద్వారా 3 వేల మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌న్నాయి. ఈ మేర‌కు ఈ విష‌యాన్ని కాసేప‌టి క్రితం వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. శ్రీసిటీలో రూ.1,000 కోట్లతో భారీ ఏసీ తయారీ కేంద్రం ఏర్పాటుకు డైకిన్‌ సంస్థ శంకుస్థాపన చేసిందని ఆయ‌న తెలిపారు.


More Telugu News