తమిళనాడులో కొత్త దంపతులకు లీటర్ పెట్రోల్, డీజిల్ కానుకగా అందించిన స్నేహితులు
- దేశంలో మండుతున్న పెట్రో ధరలు
- 16 రోజుల్లో 14 సార్లు పెరిగిన వైనం
- దేశవ్యాప్తంగా కేంద్రంపై వ్యతిరేకత
- పెళ్లికి పెట్రోల్, డీజిల్ నింపిన బాటిళ్లు తెచ్చిన అతిథులు
భారత్ లో గత 16 రోజుల వ్యవధిలో 14 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మధ్య తరగతి ప్రజలపై ఇంధన భారం అంతకంతకు పెరుగుతోందే తప్ప తగ్గడంలేదు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
తాజాగా, తమిళనాడులో ఓ పెళ్లికి విచ్చేసిన అతిథులు కేంద్రం తీరు పట్ల ఎలా నిరసన వ్యక్తం చేశారంటే... వధూవరులకు లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ ఉన్న బాటిళ్లను కానుకగా అందించారు. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా చెయ్యూరుకు చెందిన గిరీశ్ కుమార్, కీర్తన పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారంతా పెట్రోల్, డీజిల్ ను లీటర్ బాటిళ్లలో నింపి, వాటిని వధూవరులు గిరీశ్ కుమార్, కీర్తనలకు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరినీ ఆకట్టుకుంటోంది.