సీఎం జగన్‌తో సజ్జల భేటీ.. కేబినెట్ కూర్పుపై చర్చ
- తాడేపల్లిలో కొనసాగుతున్న భేటీ
- పాత మంత్రుల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై మంతనాలు
- ఈ నెల 11న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వైసీపీ కీలక నేత, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కాసేపటి క్రితం మొదలైన ఈ భేటీలో కేబినెట్ కూర్పుపై జగన్‌తో సజ్జల చర్చిస్తున్నట్లు సమాచారం.
గురువారం నాడు తన కేబినెట్‌లోని మొత్తం 24 మంది మంత్రులతో రాజీనామాలు తీసుకున్న జగన్.. ఈ నెల 11న కొత్త కేబినెట్‌తో ప్రమాణం చేయించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలి? రాజీనామాలు చేసిన మంత్రుల్లో ఎవరెవరిని తిరిగి కేబినెట్‌లోకి తీసుకోవాలి అన్న విషయాలపై జగన్‌తో సజ్జల చర్చిస్తున్నట్లు సమాచారం.