తెలంగాణను ఎవరు పాలించాలో ప్రజలు నిర్ణయిస్తారు... కేంద్రం కాదు: గవర్నర్ తమిళిసైకి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ కౌంటర్
- తెలంగాణ గవర్నర్ వర్సెస్ టీఆర్ఎస్
- ప్రోటోకాల్ పాటించడంలేదన్న తమిళిసై
- గవర్నర్ కేంద్రానికి అనుకూలం అంటూ టీఆర్ఎస్ ఆగ్రహం
- కేసీఆర్ ను ప్రజలు ఎన్నుకున్నారన్న ప్రొఫెసర్ నాగేశ్వర్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, టీఆర్ఎస్ సర్కారు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్రానికి అనుకూలంగా గవర్నర్ తమిళిసై నడుచుకుంటున్నారంటూ టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తుండగా, ప్రోటోకాల్ కు విరుద్ధంగా వ్యవహరిస్తూ తనను అవమానిస్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలపై తమిళిసై ఆరోపణలు చేస్తున్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఘాటుగా స్పందించారు. గవర్నర్ కు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని నాగేశ్వర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ను ఇంటికి పంపడానికి గవర్నర్ ఎవరు? అని ప్రశ్నించారు. "తమను ఎవరు పాలించాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు. అంతేతప్ప కేంద్ర ప్రభుత్వం నిర్ణయించదు" అని వ్యాఖ్యానించారు.