ఏపీ మొత్తమ్మీద 63 కరోనా యాక్టివ్ కేసులు... 26 జిల్లాలతో తాజా బులెటిన్ విడుదల
- ఏపీలో అత్యంత కనిష్ఠ స్థాయికి కరోనా వ్యాప్తి
- 10కి లోపే రోజువారీ కేసులు
- తాజాగా 8 మందికి కరోనా
- కరోనా నుంచి కోలుకున్న 14 మంది
ఏపీలో కరోనా వ్యాప్తి నామమాత్రంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 63 మాత్రమే. అంతేకాదు, గత కొన్నిరోజులుగా 10కి లోపే కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 3,686 శాంపిల్స్ పరీక్షించగా, 8 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
మొత్తం 26 జిల్లాల తాజా పరిస్థితిని నేటి బులెటిన్ లో పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లాలో 2, తిరుపతి జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 1, ఏలూరు జిల్లాలో 1, గుంటూరు జిల్లాలో 1, కాకినాడ జిల్లాలో 1, శ్రీ సత్యసాయి జిల్లాలో 1 కేసు వెల్లడయ్యాయి. అదే సమయంలో 14 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు.
రాష్ట్రంలో ఇప్పటిదాకా 23,19,599 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,806 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఏపీలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.