ఒంటిమిట్ట రాములోరి కల్యాణానికి సీఎం జగన్‌కు ఆహ్వానం
- జగన్‌కు ఆహ్వాన పత్రికను అందజేసిన జవహర్ రెడ్డి
- జవహర్ రెడ్డితో పాటు ఒంటమిట్ట ఈవో కూడా హాజరు
- ఒంటిమిట్టలోనే ఏపీ ప్రభుత్వ అధికారిక వేడుకలు
శ్రీరామనవమి సందర్భంగా కడప జిల్లా ఒంటిమిట్టలో జరగనున్న శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి హాజరు కావాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం ఆహ్వానం అందింది. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, ఒంటిమిట్ట రామాలయం ఈవో రమణ ప్రసాద్ కలిసి సీఎం జగన్‌కు ఆహ్వాన శుభ పత్రికను అందజేశారు.
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణలోని భద్రాద్రిలో జరిగే రాములోరి కల్యాణానికి తెలంగాణ సీఎం హాజరవుతుండగా... ఏపీలో మాత్రం శ్రీరామనవమి వేడుకలను కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.