హీరో స‌భ‌ర్వాల్‌, విల‌న్ కేసీఆర్‌.. నాటి డ్ర‌గ్స్‌ కేసుపై బండి సంజయ్ కీల‌క వ్యాఖ్య‌లు

  • 2015 నాటి డ్ర‌గ్స్ కేసును ప్ర‌స్తావించిన బండి సంజ‌య్‌
  • ఆ కేసులో కెల్విన్ పేర్లు వెల్ల‌డించిన వారు ఏమ‌య్యార‌ని ప్ర‌శ్న‌
  • పంజాబ్‌లో కాంగ్రెస్ స‌ర్కారు కూల‌డానికి డ్ర‌గ్సే కార‌ణ‌మ‌ని వెల్ల‌డి
  • తెలంగాణ‌లోనూ అదే రిపీట్ అవుతుంద‌ని జోస్యం
హైద‌రాబాద్‌లో వ‌రుస‌గా వెలుగు చూస్తున్న డ్ర‌గ్స్ కేసుల‌పై బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ శుక్ర‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 2015లో వెలుగు చూసిన టాలీవుడ్ డ్ర‌గ్స్ సినిమాలో హీరోగా సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి అకున్ స‌భ‌ర్వాల్ నిలిస్తే..ఆ సినిమాలో విల‌న్‌గా కేసీఆర్ నిలిచార‌ని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆ సినిమా క‌థ అప్పుడే ముగిస్తే... ఇప్పుడు కొత్త సినిమాను మొద‌లుపెట్టారంటూ బండి సంజ‌య్ వ్యాఖ్యానించారు.

2015లో వెలుగు చేసిన డ్ర‌గ్స్ కేసు ఏమైంద‌ని ప్ర‌శ్నించిన బండి సంజ‌య్‌.. డ్ర‌గ్స్‌కు అడ్డాగా హైద‌రాబాద్‌ను మార్చిన ఘ‌నత కేసీఆర్ స‌ర్కారుదేన‌ని ఆరోపించారు. ఈడీ ద‌ర్యాప్తున‌కు కేసీఆర్ స‌ర్కారు ఎందుకు స‌హ‌క‌రించ‌డం లేదో చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం వ‌ల్లే ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూలిపోయింద‌న్న బండి సంజ‌య్‌.. తెలంగాణ‌లోనూ అదే త‌ర‌హా ప‌రిస్థితి రిపీట్ కానుంద‌న్నారు. 2015 నాటి డ్ర‌గ్స్ కేసులో ప్ర‌ధాన నిందితుడు కెల్విన్ చాలా పేర్ల‌నే చెప్పాడ‌ని, వారంతా ఏమ‌య్యార‌ని కూడా బండి సంజ‌య్ ప్ర‌శ్నించారు.


More Telugu News