కోవిషీల్డ్ ధర రూ.600.. బూస్టర్ డోస్ ధర ప్రకటించిన సీరమ్
- ప్రైవేట్ కేంద్రాల్లో బూస్టర్ డోస్ పంపిణీ
- సీనియర్ సిటిజన్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఉచితం
- కోవిషీల్డ్ ధరను ప్రకటించిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్
దేశంలో 18 ఏళ్లు పైబడ్డ వారందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 10 నుంచి ప్రైవేట్ కేంద్రాల్లో బూస్టర్ డోస్ పంపిణీని మొదలుపెట్టనున్నట్లు ప్రకటించిన కేంద్రం.. సీనియర్ సిటిజన్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఉచితంగానే బూస్టర్ డోస్‌ను ప్రకటించింది. మిగిలిన వారంతా బూస్టర్ డోస్ కోసం డబ్బు చెల్లించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ తయారీ సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్.. తన బూస్టర్ డోస్ ధరను ప్రకటించింది. బూస్టర్ డోస్‌లో కోవిషీల్డ్‌ను రూ.600కు అందించనున్నట్లు సీరమ్ ప్రకటించింది. ఈ మేరకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి కాసేపటి క్రితం ప్రకటన వెలువడింది.