జగన్ వల్ల రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయింది: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • కరెంట్ ఛార్జీల పెంపుతో ప్రజలపై రూ. 16 వేల కోట్ల భారం వేశారన్న బుచ్చయ్య 
  • కరెంట్ కోతలతో పెట్టుబడిదారులు రాష్ట్రానికి రాకుండా పోతున్నారని వ్యాఖ్య 
  • దోచుకోవడానికే కొత్త వారికి మంత్రవర్గంలో స్థానం కల్పిస్తున్నారంటూ విమర్శ 
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. పనికిమాలిన సీఎం జగన్ వల్లే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. కరెంట్ కోతల కారణంగా పెట్టుబడిదారులు రాష్ట్రానికి రాకుండా పారిపోతున్నారని అన్నారు. కరెంట్ ఛార్జీలను పెంచడం ద్వారా ప్రజలపై రూ. 16 వేల కోట్ల భారం వేశారని దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించలేదని అన్నారు. 

ఇక కొత్తవారు దోచుకోవడానికే వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారని చెప్పారు. కనీస వసతులను కల్పించకుండానే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని విమర్శించారు. తాడేపల్లి ప్యాలస్ నుంచి రూ. 2 వేల నోట్లను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు.


More Telugu News