మంత్రి ఎర్రబెల్లిపై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
- రైతు బంధు నిలిపేస్తామని ఎర్రబెల్లి అన్నట్టుగా ప్రచారం
- ఆ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన షర్మిల
- ఎవరో ఎర్రబెల్లి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన వైనం
- దమ్ముంటే కేసీఆర్‌పై పోరాటం చేయాలని సవాల్
తెలంగాణ యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ వరుసగా నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని టీఆర్ఎస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఈ నిరసనల్లో పాలుపంచుకోని రైతులకు రైతు బంధు నిలిపివేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందిస్తూ, ఆయనపై విరుచుకుపడ్డారు .
'ఎవరో ఎర్రబెల్లి అంట. బీజేపీకి వ్యతిరేకంగా రైతులు పోరాటం చేయాలట. రైతు బంధు నిలిపేయడానికి ఎర్రబెల్లి ఎవరు? ఎర్రబెల్లికి దమ్ముంటే కేసీఆర్‌పై పోరాటం చేయాలి' అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.