గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత... స్పృహ తప్పిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు
- ధరల పెరుగుదలపై మహిళా కాంగ్రెస్ నిరసన
- బారికేడ్లను తోసుకుని రోడ్డెక్కిన నేతలు
- అడ్డుకున్న పోలీసులు, ఇరువర్గాల మధ్య తోపులాట
- స్పృహ తప్పి కింద పడిపోయిన సునీతారావు
- ఆసుపత్రికి తరలించిన పోలీసులు
హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పాక్టీ తెలంగాణ శాఖ కార్యాలయం గాంధీ భవన్ వద్ద కాసేపటి క్రితం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెరిగిన ధరలకు నిరసనగా మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టగా... పోలీసులు, మహిళా కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆమెను పోలీసులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.
దేశవ్యాప్తంగా పెరిగిన ధరలకు నిరసనగా శుక్రవారం మహిళా కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ మహిళా నేతలు రోడ్డెక్కారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు తోసివేయడంతో సునీతారావు స్పృహ తప్పి పడిపోయారు. ఆమె స్పృహ తప్పి కింద పడిపోవడంతో మహిళా నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిందపడిపోయిన సునీతారావును పోలీసులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.