మూడు రోజుల నష్టాలకు బ్రేక్... లాభాల్లో ముగిసిన మార్కెట్లు!
- 412 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 145 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 4 శాతానికి పైగా లాభపడ్డ ఐటీసీ షేరు విలువ
వరుసగా మూడు రోజుల పాటు నష్టాలను మూటకట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే తీవ్ర ఒడిదుడుకులకు గురైన మార్కెట్లు... ఆ తర్వాత లాభాల్లోకి మళ్లాయి. కీలక రేట్లను ఆర్బీఐ మార్చకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 412 పాయింట్లు లాభపడి 59,447కి చేరుకుంది. నిఫ్టీ 145 పాయింట్లు పెరిగి 17,784 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (4.36%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.70%), డాక్టర్ రెడ్డీస్ (2.67%), టైటాన్ (2.26%), రిలయన్స్ (1.75%).
టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-1.18%), మారుతి (-1.04%), ఎన్టీపీసీ (-0.98%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.65%), సన్ ఫార్మా (-0.36%).