18 ఏళ్లు పైబడ్డ వారందరికీ బూస్టర్ డోస్.. ప్రైవేట్ కేంద్రాల ద్వారా పంపిణీ
- ఆదివారం నుంచి పంపిణీ షురూ
- ఒమిక్రాన్ ఎక్స్ఈ కేసు నేపథ్యంలో ప్రకటన
- ప్రైవేట్ కేంద్రాల ద్వారా పంపిణీపై విమర్శలు
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎక్స్ఈ తొలి కేసు ముంబైలో నమోదైందంటూ మొన్న వచ్చిన వార్తలు మరోమారు జనాన్ని కలవరపాటుకు గురి చేశాయనే చెప్పాలి. అయితే అదేమీ అంతగా అందోళన చెందాల్సిన అంశం కాదని ప్రకటించి కేంద్ర ప్రభుత్వం.. తాజాగా 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ బూస్టర్ డోస్ పంపిణీకి కార్యాచరణను ప్రకటించింది.
18 ఏళ్లు పైబడ్డ వారందరూ బూస్టర్ డోస్ తీసుకోవాల్సిందేనని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 10 (ఆదివారం) నుంచి బూస్టర్ డోస్ పంపిణీని మొదలుపెట్టనున్నట్టు ప్రకటించింది. బూస్టర్ డోస్ పంపిణీని ప్రైవేట్ కేంద్రాల ద్వారా చేయనున్నట్టు కూడా కేంద్రం కీలక ప్రకటన చేసింది. దీనిపై పలు వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.