రఘురామకృష్ణరాజు తనయుడి పిటిషన్ పై సుప్రీంకోర్టు నోటీసులు
- సీబీఐ దర్యాప్తు కోసం రఘురామ కుమారుడి పిటిషన్
- విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
- కేంద్రం, సీబీఐకి నోటీసులు జారీ
వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏపీ సీఐడీ పోలీసులు శారీరక దాడి చేశారని, ఈ వ్యవహారంపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ రఘురామరాజు కుమారుడు భరత్ గతంలో దాఖలు చేసిన పిటిషన్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో నేడు విచారణకు వచ్చింది.
ఈ సందర్భంగా ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి సుప్రీం నోటీసులు జారీ చేసింది. అలాగే ఆ కౌంటర్‌పై సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్‌కు మరో రెండు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.