ఉక్రెయిన్ లో ఓ రైల్వే స్టేషన్ పై రష్యా క్షిపణి దాడులు... 30 మంది మృతి
- కొనసాగుతున్న రష్యా దాడులు
- క్రామటోర్స్క్ రైల్వే స్టేషన్ పై రెండు క్షిపణులు
- చెల్లాచెదురుగా మృతదేహాలు
- 100 మందికి పైగా గాయాలు
ఉక్రెయిన్ లో రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సాధారణ పౌరులను కూడా రష్యా లక్ష్యంగా చేసుకుంటోందని ఉక్రెయిన్ రక్షణ శాఖ ఆరోపిస్తోంది. తాజాగా, తూర్పు ఉక్రెయిన్ లోని క్రామటోర్స్క్ రైల్వే స్టేషన్ పై రష్యా క్షిపణి దాడులు చేసిందని వెల్లడించింది. రెండు రష్యా క్షిపణులు ఈ రైల్వే స్టేషన్ ను తాకాయని, 30 మందికి పైగా మరణించారని ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. 100 మందికి పైగా గాయపడ్డారని వివరించింది.
క్రామటోర్స్క్ రైల్వే స్టేషన్ ను సాధారణ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వినియోగిస్తున్నామని పేర్కొంది. రష్యా యుద్ధ నేరగాళ్లు తమ పౌరులను ఉద్దేశపూర్వకంగానే లక్ష్యంగా చేసుకుంటున్నారని, భారీస్థాయిలో విధ్వంసం సృష్టించే క్లస్టర్ బాంబులను కూడా ఉపయోగిస్తున్నారని ఆరోపించింది. ఈ దాడికి సంబంధించిన ఫొటోలను కూడా ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. రక్తపు మడుగుల్లో మృతదేహాలు పడివున్న తీరు భయానకంగా ఉంది.