ప్రకాశం జిల్లాలో బీ ట్యాక్స్ దందా... టీడీపీ ఎమ్మెల్యే ఆరోపణలు

  • బాలినేనిపై డోలా బాల వీరాంజనేయస్వామి ధ్వజం
  • మూడేళ్లలో రూ.1,734 కోట్ల అవినీతికి పాల్పడినట్టు వెల్లడి
  • విద్యుత్ శాఖను నిర్లక్ష్యం చేశారని ఆరోపణ
  • రాష్ట్రం అంధకారంలో మునిగిపోయిందని విమర్శలు
ప్రకాశం జిల్లా టీడీపీ నేత, కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రమంతా జే ట్యాక్స్ నడుస్తుంటే, ప్రకాశం జిల్లాలో బీ ట్యాక్స్ దందా నడుస్తోందని ఆరోపించారు. 

విద్యుత్ శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతిలో మునిగిపోయారని, దాంతో తన శాఖను నిర్లక్ష్యం చేయడంతో రాష్ట్రం అంధకారంలో చిక్కుకుందని విమర్శించారు. తన విద్యుత్ శాఖలోనూ, ఇసుక, భూ అక్రమాలు, గ్రానైట్ కంపెనీలు, ఉద్యోగుల బదిలీలు సహా వివిధ రూపాల్లో బాలినేని అవినీతి కొనసాగిందని డోలా బాల వీరాంజనేయస్వామి వివరించారు. ఈ మూడేళ్ల కాలంలో బాలినేని రూ.1,734 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని వెల్లడించారు.


More Telugu News