ఏపీలో పవర్ హాలిడేలపై నారా లోకేశ్ స్పందన ఇదే
- మూడు రంగాల్లో హాలిడేలను ప్రస్తావించిన లోకేశ్
- రాష్ట్ర అభివృద్ధికీ హాలిడే తప్పదేమోనని ఎద్దేవా
- సీఎం జగన్‌కు కొత్త పేర్లు పెట్టిన లోకేశ్
ఏపీలో పవర్ హాలిడేను ప్రకటిస్తూ గురువారం వెలువడిన ప్రకటనలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అన్నింటా హాలిడేలను ప్రకటిస్తూ రాష్ట్రంలో అభివృద్ధికి కూడా హాలిడేను ప్రకటించేలా వైసీపీ సర్కారు సాగుతోందని ఆయన విమర్శించారు.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జాలీ రెడ్డిగా అభివర్ణించిన లోకేశ్.. మూడేళ్ల జగన్ పాలనను మూడు ముక్కల్లో చెప్పాలంటే... క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, జాబ్ హాలిడేలతో శాశ్వతంగా రాష్ట్రంలో అభివృద్ధికి హాలిడేనేనని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా అన్నింటి హాలిడేలను ప్రకటిస్తూ సాగుతున్న సీఎం జగన్‌ను ఆయన హాలిడే సీఎం అని కూడా లోకేశ్ సంబోధించారు.