విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు.. జగన్ దిగిపోవాలి.. బీజేపీ రావాలి: సోము వీర్రాజు
- ఏపీలోని అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు
- కేంద్రం ఇచ్చిన నిధులతోనే వైసీపీ జగనన్న కాలనీలు నిర్మిస్తోంది
- చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందన్న వీర్రాజు
'కావాలి జగన్.. రావాలి జగన్.. మన జగన్..' అంటూ గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ వాడిన నినాదాన్ని గుర్తు చేస్తూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'రాష్ట్రం బాగుండాలంటే సీఎం పదవి నుంచి జగన్ దిగిపోవాలి.. బీజేపీ రావాలి' అని ఆయన అన్నారు.
విద్యుత్ కోతలతో ఏపీలోని అన్ని వర్గాల ప్రజలు అల్లాడుతున్నారని సోము వీర్రాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే వైసీపీ జగనన్న కాలనీలు నిర్మిస్తోందని చెప్పారు. కేంద్ర సర్కారు నిధులు ఇచ్చినప్పటికీ చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆయన ఆరోపించారు.
ఇదే అంశంపై సోము వీర్రాజు ట్విట్టర్‌లో స్పందించారు. 'జగనన్న ఇల్లు అంటూ వైసీపీ చేస్తోన్న ప్రచారం-ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి వాస్తవాలు ఇవి' అంటూ ఆయన పలు విషయాలు తెలిపారు. 'పార్వతీపురంలో నిర్మిస్తున్న గృహాల సముదాయాన్ని పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించాము. కేంద్రం 12 వేల కోట్ల రూపాయలు ఇచ్చినా కనీసం మౌలిక సదుపాయాల కల్పనలో కూడా విఫలమైన ఈ రాష్ట్ర పాలకులను అసమర్థ ప్రభుత్వం కాక ఇంకేమనాలి? ప్రభుత్వం ఇచ్చే నిధులకు వైసీపీ రంగులు పులుముకోవడం తప్ప చిత్తశుద్ధితో చేసే అభివృద్ధి పని ఒక్కటి కూడా రాష్ట్రంలో కనిపించడం లేదు' అని సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు.