ఐపీఎల్ లో ఎవరూ కొనలేదు... ఢాకా ప్రీమియర్ లీగ్ లో పరుగుల వర్షం కురిపిస్తున్న తెలుగుతేజం
- ఇటీవల ఐపీఎల్ వేలం
- అమ్ముడుపోని హనుమ విహారి
- ఢాకా లీగ్ లో అబహాని జట్టుకు ప్రాతినిధ్యం
- విధ్వంసక ఆటతీరు కనబరుస్తున్న విహారి
భారత టెస్టు జట్టులో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న తెలుగుతేజం హనుమ విహారి బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ లో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ఆడిన మూడు మ్యాచ్ ల్లో విహారి ఒక సెంచరీ, ఒక అర్ధసెంచరీ నమోదు చేయడం విశేషం. ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో హనుమ విహారిని ఏ ఒక్క జట్టు కొనుగోలు చేయలేదు. కనీస ధరను రూ.50 లక్షలుగా పేర్కొన్నప్పటికీ అతడి వైపు కన్నెత్తి చూసినవాళ్లు లేరు. దాంతో విహారి, మరికొందరు ఢాకా ప్రీమియర్ లీగ్ కు తరలి వెళ్లారు.
ఈ లీగ్ లో హనుమ విహారి అబహాని లిమిటెడ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఓ మ్యాచ్ లో 43 బంతుల్లో అజేయంగా 112 పరుగులు చేసిన విహారి విశ్వరూపం ప్రదర్శించాడు. మరో మ్యాచ్ లో 23 బంతుల్లో 59 పరుగులు సాధించాడు. కాగా, విహారి తాజా ఫామ్ చూసిన సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియాలో స్పందించారు. ఎలాగైనా విహారిని సన్ రైజర్స్ టీమ్ లోకి తీసుకోవాలని, అతడి ఫామ్ జట్టుకు ఎంతో లాభిస్తుందని వారు అంటున్నారు.