మంత్రులు, ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ పై తిరగబడాలి: షర్మిల
- సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తిన షర్మిల
- నిరుద్యోగ అంశం ప్రస్తావన
- ఉద్యోగాల్లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడి
- కేసీఆర్ కు చీమకుట్టినట్టయినా లేదని విమర్శలు
సీఎం కేసీఆర్ మోసపూరితమైన హామీలు ఇచ్చారంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ఇది ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం కాదని విమర్శించారు. పాలకుల కోసం ప్రజలను దోచుకునే ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా గెలిపిస్తే కేసీఆర్ ఏంచేశారని షర్మిల ప్రశ్నించారు.
డిగ్రీలు, పీజీలు చేసిన ఎంతోమంది రోడ్లపై తిరుగుతున్నారని అన్నారు. వందలమంది నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, కానీ సీఎం కేసీఆర్ కు కనీసం చీమకుట్టినట్టయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను సైతం వంచించారని మండిపడ్డారు. చివరి గింజ వరకు కేసీఆర్ వడ్లు కొనాల్సిందేనని షర్మిల స్పష్టం చేశారు.
ఎన్నికల్లో ప్రజలు గెలిపించింది వడ్లు కొనడానికా? లేక ధర్నాలు చేయడానికా? అని ప్రశ్నించారు. మోదీ వస్తే ప్రశ్నించకుండా కేసీఆర్ ఎందుకు దాక్కున్నారని నిలదీశారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ పై తిరగబడాలన్నారు. కేంద్రానికి ఎందుకు లేఖ రాశారని కేసీఆర్ ను నిలదీయాలని పిలుపునిచ్చారు.