ఒకే ఫ్రేమ్‌లో మోదీ, సోనియా.. వైరల్‌గా మారిన ఫొటో
- ముగిసిన పార్లమెంటు సమావేశాలు
- ఆయా పార్టీల సభ్యులతో స్పీకర్ ప్రత్యేక సమావేశం
- భేటీలో ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన మోదీ, సోనియా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ.. రాజకీయంగా భిన్న ధ్రువాలుగానే మెలుగుతున్నారు. ఎన్నికల సమయంలోనే కాకుండా మిగతా సందర్భాల్లోనూ ఏమాత్రం అవకాశం చిక్కినా...ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. గురువారంతో ముగిసిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలపై సోనియా గాంధీ ఓ రేంజిలో విమర్శలు గుప్పించారు.
పార్లమెంటు సమావేశాలు ముగిసిన సందర్భంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆయా పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటికే సమావేశానికి వచ్చిన మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌లు ఓంబిర్లాతో కలిసి కూర్చున్నారు. ఆ సమయంలో సోనియా గాంధీ సదరు సమావేశం మందిరంలోకి అడుగుపెట్టగా... ఓంబిర్లాతో పాటు మోదీ, రాజ్‌నాథ్ సింగ్‌లు కూడా లేచి నిలబడ్డారు. ఆ ముగ్గురు నేతలకు సోనియా నమస్కరిస్తున్న సందర్భంగా తీసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.