నా మంత్రి పదవి నిలిచే అవకాశాలు తక్కువే: వెల్లంపల్లి
- ఏపీ మంత్రివర్గం రాజీనామా
- సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం
- రాజీనామాలు సమర్పించిన మంత్రులు
- ఐదారుగురి పదవులు నిలిచే అవకాశం ఉందన్న వెల్లంపల్లి
ఏపీలో ఇప్పటివరకు కొనసాగిన మంత్రివర్గం నేడు రాజీనామా చేసింది. కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా 24 మంది మంత్రులు తమ రాజీనామాలను సమర్పించారు. జగన్ నిర్ణయమే శిరోధార్యమని ముక్తకంఠంతో చెబుతున్నారు.
తాజాగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, సీఎం నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటామని తెలిపారు. పార్టీ పరమైన ఆదేశాలను శిరసావహిస్తామని స్పష్టం చేశారు. అయితే కొంతమంది మంత్రులు క్యాబినెట్ లో కొనసాగుతారని, బహుశా ఓ ఐదారుగురు తమ పదవులు నిలుపుకునే అవకాశం ఉందని వెల్లంపల్లి అభిప్రాయపడ్డారు. మరికొందరు కొత్తవారికి క్యాబినెట్ లో అవకాశమిస్తామని చెప్పారని వివరించారు.
తన విషయం చెబుతూ, "నేను మంత్రి పదవిలో కొనసాగే అవకాశాలు తక్కువ" అని పేర్కొన్నారు. రాజీనామాల విషయంలో తమకంటే సీఎం జగనే ఎక్కువ బాధపడ్డారని వెల్లంపల్లి అన్నారు. అయితే 'మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం' అని ఆయనతో చెప్పామని వెల్లడించారు.