మ‌హిళా ఎంపీ చేతిలోని మైక్‌ను లాగేసుకున్న ఎమ్మెల్యే

  • మ‌హ‌బూబాబాద్‌లో టీఆర్ఎస్ కార్య‌క్ర‌మం
  • ప్ర‌సంగించేందుకు సిద్ధ‌ప‌డ్డ మ‌హిళా ఎంపీ
  • దురుసుగా వ‌చ్చి మైకు లాక్కున్న ఎమ్మెల్యే
  • మంత్రి స‌మ‌క్షంలోనే జ‌రిగిన ఘ‌ట‌న‌
తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు సంబంధించి మ‌హ‌బూబాబాద్ జిల్లా శాఖ‌లో విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. మ‌హ‌బూబాబాద్ ఎంపీ మాలోత్ క‌విత, మ‌హ‌బూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంక‌ర్ నాయ‌క్‌ల మ‌ధ్య త‌లెత్తిన ఈ విభేదాలు గురువారం నాటి ఓ కార్య‌క్ర‌మంలో బ‌ట్ట‌బ‌య‌ల‌య్యాయి. ఓ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకున్న ఈ ఇద్ద‌రు నేత‌లు త‌మ మ‌ధ్య విభేదాల‌ను బ‌హిర్గతం చేసుకున్నారు. 

మ‌హ‌బూబాబాద్‌లో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించేందుకు సిద్ధ‌ప‌డిన మాలోత్ క‌విత‌... చేతిలో మైక్ ప‌ట్టుకుని నిల‌బ‌డ‌గా... అక్క‌డికి దురుసుగా వచ్చిన శంక‌ర్ నాయ‌క్ ఆమె చేతిలోని మైక్‌ను లాగేసుకున్నారు. అంత‌టితో ఆగ‌ని ఆయ‌న.. ఎంపీ వెనుక ఎత్తుగా ఉన్న వేదిక‌ను ఎక్కి ప్ర‌సంగించారు. ఈ త‌తంగం మంత్రి సత్య‌వ‌తి రాథోడ్ స‌మ‌క్షంలోనే జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.


More Telugu News