తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంపై కేంద్రానికి గవర్నర్ నివేదిక?
- ఢిల్లీ పర్యటనలో తెలంగాణ గవర్నర్
- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ
- ఈ భేటీలోనే డ్రగ్స్ దందాపై నివేదిక అందజేత
తెలంగాణలో నిత్యం తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్న మాదక ద్రవ్యాల వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తోంది. ఈ డ్రగ్స్ దందా ఒక్కోసారి రాజకీయంగా ఘాటు ఆరోపణలు,. ప్రత్యారోపణలకు కారణమవుతోంది. గతంలో టాలీవుడ్ ప్రముఖులను ముప్పుతిప్పలు పెట్టిన డ్రగ్స్ దందా.. తాజాగా ఫుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారంలో రాజకీయ ప్రముఖులనూ కలవరపాటుకు గురి చేస్తోంది.
ఇలాంటి కీలక తరుణంలో తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించిన సమగ్ర నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరినట్టు తెలుస్తోంది. బుధవారం నాడు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. గురువారం నాడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలోనే తెలంగాణలో డ్రగ్స్ దందాకు సంబంధించిన నివేదికను అమిత్‌షాకు గవర్నర్ అందజేసినట్టు సమాచారం.