హైదరాబాద్ డ్రగ్స్.. 15 మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను తొలగించిన టాప్ ఐటీ కంపెనీలు.. మరో 50 మందికి నోటీసులు!

  • డ్రగ్స్, గంజాయి వాడుతున్న ఐటీ ఉద్యోగులు
  • డ్రగ్స్ పెడ్లర్ల వద్ద లభిస్తున్న ఐద్యోగుల వివరాలు
  • పోలీసులకు చిక్కిన మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇన్ఫోసిస్ ఉద్యోగులు
హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. అప్పట్లో టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి, తాజాగా ఓ పబ్ లో డ్రగ్స్ భాగోతం బయట పడేంత వరకు కూడా అంతా సంచలనమే. డ్రగ్స్ పెడ్లర్ల వద్ద లభిస్తున్న ఫోన్ నంబర్లలో సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు పెద్ద సంఖ్యలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల పేర్లు బయటకొస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో డ్రగ్స్ తీసుకుంటున్న ఉద్యోగులపై ఐటీ కంపెనీలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. మత్తు పదార్థాలకు బానిసైన ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. తాజాగా 13 మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగించాయి. మరో 50 మంది ఉద్యోగులకు నోటీసులు ఇచ్చాయి. 

పట్టుబడిన డ్రగ్స్ పెడ్లర్ల వద్ద ఐటీ ఉద్యోగుల చిట్టా బయటపడుతోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ అమ్మినట్టు పోలీసులు తేల్చారు. డ్రగ్స్ వాడిన ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మహీంద్రా క్యూసాఫ్ట్ ఉద్యోగులను పోలీసులు పట్టుకున్నారు. టోనీ, ప్రేమ్ కుమార్, లక్ష్మీపతి వద్ద నుంచి వీరు డ్రగ్స్, గంజాయి కొన్నట్టు పోలీసులు నిర్ధారించారు.


More Telugu News