జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదం చాలా తగ్గింది: కేంద్ర ప్రభుత్వం
- 45 శాతం ఉగ్రవాదం తగ్గింది
- 2021 నాటికి విద్రోహ ఘటనలు 229కి తగ్గాయి
- 2019 నుంచి 2021 మధ్య 406 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు
గత నాలుగేళ్లలో జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదం 45 శాతం తగ్గిందని కేంద్ర హోంశాఖ ఈరోజు తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పార్లమెంటులో మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో అనేక ఆందోళనలు వ్యక్తం అయ్యాయని... అయినప్పటికీ తమ చర్యలు కశ్మీర్ కు ఎంతో మేలు చేశాయని చెప్పారు.
ఇక 2018లో జమ్మూకశ్మీర్ లో 417 విద్రోహ ఘటనలు జరగ్గా... 2021 నాటికి అవి 229కి తగ్గాయని తెలిపారు. ఆ ప్రాంతంలో ఉగ్రకార్యకలాపాలు సగానికి సగం తగ్గినట్టు డేటా చెపుతోందని అన్నారు. 2019 నుంచి 2021 మధ్య ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 406 మంది భద్రతా సిబ్బంది, 177 మంది సాధారణ పౌరులు చనిపోయారని తెలిపారు.