క్షుద్ర పూజలపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ స్పందన ఇదే
- క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ శ్రీనివాస్‌పై ఆరోపణలు
- న్యూస్ ఛానెళ్లలో పూజల వీడియోలు ప్రసారం
- క్షుద్ర పూజలు చేయలేదని శ్రీనివాస్ వివరణ
తెలంగాణ వైద్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ క్షుద్ర పూజలు చేస్తున్నారన్న వార్తలు రాష్ట్రంలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. కొత్తగూడెంలో జరిగిన క్షుద్ర పూజల్లో శ్రీనివాస్ పాల్గొన్న వీడియోలు కూడా న్యూస్ ఛానెళ్లలో ప్రసారం కావడంతో ఆయనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు.
ఈ సందర్భంగా క్షుద్ర పూజల ఆరోపణలపై శ్రీనివాస్ మాట్లాడుతూ.. "మా నాన్న పేరిట చారిటబుల్ ట్రస్ట్ పెట్టాం. సేవలో భాగంగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఎంపీపీలు పూజలు చేస్తున్నామని పిలిచారు. హాలిడేలో భాగంగా కొత్తగూడెం వెళ్లాను. బంజారా గిరిజన దేవత పూజకు మాత్రమే హాజరయ్యా. నేను హోమానికే దండం పెట్టాను. వ్యక్తికి దండం పెట్టలేదు. హోమంలో పాల్గొని బొట్టు మాత్రమే పెట్టుకున్నా. అంతే. అంతకుమించి ఏమీ లేదు. రాజకీయాలతో నాకు సంబంధం లేదు" అంటూ ఆయన వివరించారు.