గ‌వ‌ర్న‌ర్‌తో ముగిసిన జ‌గ‌న్ భేటీ.. ఏమేం చ‌ర్చించారంటే..!

  • అర గంట‌కు పైగా సాగిన భేటీ
  • మంత్రివ‌ర్గ పునర్వ్యవ‌స్థీక‌ర‌ణ‌పైనే చ‌ర్చ‌
  • కొత్త మంత్రుల జాబితాను గ‌వ‌ర్న‌ర్‌కు ఇచ్చిన జ‌గ‌న్‌
  • కేబినెట్ భేటీలో మంత్రుల రాజీనామాపై చ‌ర్చ‌
ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌తో సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భేటీ ముగిసింది. విజ‌య‌వాడ‌లోని రాజ్ భ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ భేటీ అర‌గంట‌కు పైగానే సాగింది. ఈ భేటీలో సాంతం మంత్రివ‌ర్గ పునర్వ్యవ‌స్థీక‌ర‌ణ‌పైనే జ‌రిగింది. ఈ నెల 11న జ‌ర‌గ‌నున్న మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌కు సంబంధించిన ఏర్పాట్ల‌పైనా జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రించారు.

ఇక గురువారం నాడు జ‌ర‌గ‌నున్న కేబినెట్ భేటీలోనే మంత్రులంద‌రితోనూ రాజీనామాలు తీసుకునే విష‌యంపై జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌తో ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. అదే స‌మ‌యంలో కొత్త‌గా మంత్రివ‌ర్గంలోకి తీసుకోబోయే నేత‌లు, మంత్రివ‌ర్గ పున‌ర్వ్యవ‌స్థీక‌ర‌ణ‌లోనూ కొన‌సాగించ‌నున్న మంత్రుల పేర్ల‌ను కూడా జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రించారు. పాత మంత్రుల్లో కొంద‌రిని కొన‌సాగించ‌డానికి గ‌ల కార‌ణాల‌ను కూడా జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌కు తెలిపారు.


More Telugu News