ఏపీ గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చ
- రాజ్ భవన్‌లో మొదలైన భేటీ
- మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపైనే ప్రధానంగా చర్చ
- కొత్త మంత్రుల పేర్లను గవర్నర్‌కు అందజేయనున్న జగన్
- మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తీసుకోనున్న సీఎం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపటి క్రితం విజయవాడలోని రాజ్ భవన్‌కు వెళ్లారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఆయన గవర్నర్‌తో చర్చిస్తున్నారు.
ఈ సందర్భంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు గవర్నర్ నుంచి జగన్ ఆమోదం తీసుకుంటారని తెలుస్తోంది. అదే సమయంలో కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోనున్న నేతల పేర్లను కూడా జగన్ గవర్నర్ ముందు ఉంచనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. మంగళవారం నాడు ప్రధానితో జరిగిన భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను కూడా జగన్ గవర్నర్ వద్ద ప్రస్తావించనున్నట్లు సమాచారం.