మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలి: కేటీఆర్ డిమాండ్

  • పెట్రో ధ‌ర‌ల పెంపుతో ప్ర‌జ‌ల‌పై రూ.26.51 ల‌క్ష‌ల కోట్ల భారమన్న కేటీఆర్ 
  • దోపిడీ కూడా దేశం కోసం, ధ‌ర్మం కోస‌మేనా? అని ప్రశ్న 
  • పీఎం పెట్రో ప‌న్ను యోజ‌న తెచ్చార‌న్న కేటీఆర్‌
దేశంలో పెరుగుతున్న పెట్రో ధ‌ర‌ల‌పై నిర‌స‌న తెలియజేస్తూ టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి బుధ‌వారం బహిరంగ లేఖ రాశారు. ఈ సంద‌ర్భంగా పెట్రో ధ‌ర‌ల నియంత్ర‌ణ‌లో విఫ‌లమైన ప్ర‌ధాని దేశ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 

దోపిడీ ల‌క్ష్యంగా పీఎం పెట్రో ప‌న్ను యోజ‌న ప‌థ‌కం తీసుకొచ్చార‌ని ప్ర‌ధానిపై కేటీఆర్ విమ‌ర్శ‌లు గుప్పించారు. పెట్రో ధ‌ర‌ల పెంపుతో దేశ ప్ర‌జ‌ల‌పై రూ.26.51 ల‌క్ష‌ల కోట్ల మేర భారం ప‌డింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. దోపిడీ కూడా దేశం కోసం, ధ‌ర్మం కోస‌మేనా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికైనా పెట్రో ధ‌ర‌ల బాదుడు ఆప‌కుంటే.. ప్ర‌జ‌లు బీజేపీని తిర‌స్క‌రించ‌డం ఖాయ‌మ‌ని కేటీఆర్ జోస్యం చెప్పారు.


More Telugu News