నైజామ్ లో 'ఆర్ ఆర్ ఆర్' అరుదైన రికార్డ్!

  • మార్చి 25వ తేదీన విడుదలైన 'ఆర్ ఆర్ ఆర్'
  • దేశ విదేశాల్లో రికార్డుస్థాయి వసూళ్లు
  • 12 రోజుల్లో నైజామ్ షేర్ 101 కోట్లు 
  • కొనసాగుతున్న దూకుడు  
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' తన దూకుడును కొనసాగిస్తూనే వెళుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో తన జోరు చూపుతోంది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సెట్ చేస్తూ వెళుతోంది. ఇతర భాషలకి చెందిన బడా దర్శక నిర్మాతలు .. హీరోలు .. ఈ రికార్డులను టచ్ చేయడం సాధ్యమేనా? అన్నట్టుగా ఆశ్చర్యపోతున్నారు. 

ఇక నైజామ్ లో కూడా ఈ సినిమా తన పేరుతో ఒక అరుదైన రికార్డును నెలకొల్పింది. ఇక్కడ ఈ సినిమా 12వ రోజున 2.1 కోట్ల షేర్ ను సాధించింది. దాంతో ఇక్కడిది 101 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసింది. ఇక్కడ 101 కోట్ల షేర్ మార్క్ ను అందుకున్న ఫస్టు  సినిమాగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ ఎక్కువగా ఉంటారని రాజమౌళి ముందుగానే చెప్పారు. అందుకు తగినట్టుగానే రిపీట్ ఆడియన్స్ తాకిడి ఎక్కువగా ఉందనే టాక్ వినిపిస్తోంది. లాంగ్ రన్ లో ఈ సినిమా నమోదు చేసే రికార్డులను ఇప్పట్లో మరో సినిమా అందుకోవడం అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


More Telugu News