యుద్ధంపై భార‌త వైఖ‌రిని కీర్తించిన‌ టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌

  • యుద్ధంపై ప్ర‌క‌ట‌న చేసిన విదేశాంగ మంత్రి
  • ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తించిన గ‌ల్లా జ‌య‌దేవ్‌
  • భార‌త్ త‌న సొంత వైఖ‌రికి క‌ట్టుబ‌డి ఉండ‌టం గొప్ప అని వ్యాఖ్య‌
ఉక్రెయిన్‌, ర‌ష్యాల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధంపై నిన్న‌టిదాకా త‌ట‌స్థ వైఖ‌రిని అవ‌లంబించిన భార‌త్‌.. తాజాగా ఉక్రెయిన్‌లోని బుచాలో ర‌ష్యా సైన్యం పాల్ప‌డిన దురాగ‌తాల‌ను తీవ్రంగా ఖండించింది. ఈ మేర‌కు బుచాలో ర‌ష్యా సైనిక దురాగ‌తాల‌ను ఖండిస్తూ భార‌త విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్ బుధవారం నాడు పార్ల‌మెంటులో ఓ ప్ర‌క‌ట‌న చేశారు.

ఈ ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తిస్తూ టీడీపీ యువ‌నేత‌, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రెండో ప్ర‌పంచ యుద్ధం నేప‌థ్యంలో ప్ర‌పంచం రెండుగా విడిపోగా.. ఇప్పుడు చైనా, ర‌ష్యా లాంటి దేశాల కార‌ణంగా ప్ర‌పంచ దేశాలు ప‌లు విభాగాలుగా ఏర్ప‌డినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని గ‌ల్లా వ్యాఖ్యానించారు. ప్ర‌పంచ దేశాల్లో ఎన్ని ప‌రిణామాలు వ‌చ్చినా.. భార‌త్ మాత్రం త‌న సొంత వైఖ‌రికి క‌ట్టుబ‌డి ఉండ‌టం గొప్ప విష‌య‌మ‌ని ఆయ‌న తెలిపారు.


More Telugu News