ప్లీజ్.. నాపై తప్పుడు ప్రచారం చేయొద్దు: రాశీ ఖన్నా
- ఇటీవల దక్షిణాది సినిమాలపై విమర్శలు గుప్పించిన రాశీ ఖన్నా
- రాశీ ఖన్నాపై మండిపడ్డ దక్షిణాది సినీ ప్రేక్షకులు
- తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్న రాశీ ఖన్నా
తనకు ఎంతో ఇచ్చిన దక్షిణాది సినీ పరిశ్రమపై హీరోయిన్ రాశీ ఖన్నా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాది సినిమాలు రొటీన్ గా ఉంటాయని... హీరోయిన్ రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించి, కనుమరుగు అవుతుంటుందని ఆమె అన్నారు. హీరోయిన్ కు గుర్తింపు కలిగిన పాత్రలు ఉండవని చెప్పారు. బాలీవుడ్ లో తనకు మంచి పాత్రలు వస్తున్నాయని... ఇకపై తనలో కొత్త నటిని చూస్తారని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై దక్షిణాది సినీ ప్రేక్షకులు మండిపడ్డారు.
హీరోయిన్ గా ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చిన దక్షిణాది సినీ పరిశ్రమను విమర్శిస్తావా? అంటూ మండిపడ్డారు. బాలీవుడ్ లో అవకాశాలు రాగానే.. సౌత్ ఇండస్ట్రీ చులకన అయిందా? అంటూ నిప్పులు చెరిగారు. దీంతో, అమ్మడు దిగివచ్చింది. దక్షిణాది చిత్ర పరిశ్రమను తాను దూషించానంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని రాశీ ఖన్నా అన్నారు. ఏ చిత్ర పరిశ్రమ అయినా... తాను చేసే ప్రతి సినిమాపై తనకు ఎంతో గౌరవ మర్యాదలు ఉంటాయని చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆపాలని కోరారు.