'బీస్ట్' సినిమాను బ్యాన్ చేయండి: తమిళనాడు ముస్లిం లీగ్ డిమాండ్
- ఈ నెల 13న విడుదల కాబోతున్న విజయ్ సినిమా 'బీస్ట్'
- ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తున్నారన్న తమిళనాడు ముస్లిం లీగ్
- 'బీస్ట్' విడుదల కాకుండా నిషేధించాలని డిమాండ్
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'బీస్ట్' సినిమా ఈ నెల 13న విడుదల కాబోతోంది. ఈ సినిమాలోని రెండు పాటలు ఇప్పటికే విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రకారం ఓ మాల్ లో ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న వారిని రక్షించే సైనికుడిగా ఇందులో విజయ్ కనిపించబోతున్నాడు. మరోవైపు ఈ చిత్రాన్ని కువైట్ దేశం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా తమిళనాడులో సైతం ఈ సినిమాకు నిరసన సెగ తగులుతోంది. ఈ చిత్రం విడుదల కాకుండా నిషేధించాలని తమిళనాడు ముస్లిం లీగ్ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ముస్లింలను తమిళనాడు చిత్ర పరిశ్రమ ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తోందని తమిళనాడు ముస్లిం లీగ్ అధ్యక్షుడు ముస్తఫా లేఖలో పేర్నొన్నారు. ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ సినిమాలు నిర్మించడం దురదృష్టకరమని అన్నారు.