ఉక్రెయిన్‌పై యుద్ధం ఎఫెక్ట్‌... పుతిన్ కుమార్తెల‌పై ఆంక్ష‌ల‌కు రంగం సిద్ధం

  • పుతిన్‌కు ఇద్ద‌రు కుమార్తెలు
  • వారిపై ఆంక్ష‌లు విధించే దిశ‌గా ఈయూ
  • ఇప్ప‌టికే సిద్ధ‌మైన డ్రాఫ్ట్‌పై స‌భ్య దేశాల చ‌ర్చ‌లు
  • పుతిన్‌ను మాన‌సికంగా కుంగ‌దీసేందుకే ఈ ఆంక్ష‌లు
ఉక్రెయిన్‌పై యుద్ధం మొద‌లెట్టిన ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌పంచ‌దేశాల‌తో పాటు ఆయా దేశాల కూట‌ములు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అయితే ఆయా దేశాల య‌త్నాలు ఏమాత్రం ఫలిస్తున్న దాఖ‌లా క‌నిపించ‌డం లేదు. దీంతో పుతిన్‌ను మాన‌సికంగా కుంగ‌దీసే చ‌ర్య‌ల‌కు యూరోపియ‌న్ యూనియ‌న్ (ఈయూ) కూట‌మి ఇప్పుడో కీల‌క నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది.

పుతిన్ కుమార్తెలు మారియా, క్యాథ‌రినాల‌పై ఆంక్ష‌లు విధించే దిశ‌గా ఈయూ సాగుతోంది. ఇప్ప‌టికే ఈ దిశ‌గా ఓ డ్రాఫ్ట్ త‌యారు కాగా.. ఈయూ స‌భ్య దేశాలు దానిని ప‌రిశీలిస్తున్నాయి. కూట‌మిలోని మెజారిటీ దేశాలు ఓకే అంటే... ఆ మ‌రుక్ష‌ణ‌మే పుతిన్ కుమార్తెలు ఇద్ద‌రిపైనా ఆంక్ష‌లు అమ‌లు అవుతాయి.

 కుమార్తెల‌కు సంబంధించి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న పుతిన్‌.. ఈయూ ఈ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటే మాత్రం మాన‌సికంగా తీవ్రంగా క‌ల‌త చెందే ప్ర‌మాదం ఉంద‌న్న‌ విశ్లేష‌ణ‌లు వెలువడుతున్నాయి. అయితే పుతిన్ మాదిరే ఆయ‌న కుమార్తెల‌కు విదేశాల్లో ఆస్తులు ఉన్నాయా?  లేవా? అన్న‌ది మాత్రం తెలియ‌రాలేదు.


More Telugu News