కొత్త జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వండి.. రాజ్యసభలో విజయసాయిరెడ్డి డిమాండ్
- కొత్త జిల్లాల ఏర్పాటును ప్రస్తావించిన సాయిరెడ్డి
- ఒక్కో కొత్త జిల్లాకు కేంద్రీయ విద్యాలయం ప్రకటించాలని డిమాండ్
- కేంద్రానికి రాష్ట్రం పూర్తి సహకారం అందిస్తుందని వెల్లడి
ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటైపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సీఎం జగన్ పూర్తి వివరాలు అందజేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో జిల్లాల సంఖ్య 26కు చేరింది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ప్రతి జిల్లాలో ఓ కేంద్రీయ విద్యాలయం ఉండాలి. ఇదే అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావించిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి.. కొత్త జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించాలని డిమాండ్ చేశారు.
బుధవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన సాయిరెడ్డి.. ఏపీలో కొత్తగా ఏర్పాటైన కొత్త జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని కూడా సాయిరెడ్డి తెలిపారు.