నేను చేసిన పనికి రోహిత్ నన్ను తిట్టాడు.. నేను తలవంచుకుని నిలబడిపోయా: ఇషాన్ కిషన్
- కెరీర్ ఆరంభంలో జరిగిన ఘటనను వివరించిన ఓపెనర్
- పాతదానిలా మారిస్తే క్రెడిట్ కొట్టేయొచ్చనుకున్నా
- బంతిని గడ్డిపై నుంచి దొర్లించి రోహిత్ కు ఇచ్చా
- టవల్ తో బంతిని తుడుస్తూ నన్ను తిట్టాడు
- బయట ఫ్రెండ్లీగా ఉంటాడంటూ కెప్టెన్ ను ఆకాశానికెత్తిన ఇషాన్
మామూలుగా రోహిత్ శర్మ అనగానే చాలా కూల్ ఆటగాడు అనే భావన వచ్చేస్తుంటుంది. ధోనీ తర్వాత మిస్టర్ కూల్ గా రోహిత్ ను పిలుస్తుంటారు. అలాంటి రోహిత్ ఎప్పుడైనా కోప్పడడం చూశారా? కోపం కాదు.. ఆటగాళ్లను తిట్టేస్తాడని చెబుతున్నాడు యువ డాషింగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్. ఆ వెంటనే చల్లబడిపోతాడని కూడా అంటున్నాడు. అలాగే తన కెప్టెన్ ను ఆకాశానికెత్తేశాడు. ఇక కెరీర్ ఆరంభంలో రోహిత్ చేతిలో తిట్లు తిన్న ఓ సందర్భాన్ని ఇషాన్ గుర్తు చేసుకున్నాడు.
‘‘అది నా కెరీర్ ఆరంభ రోజులు. ఓసారి వాంఖడేలో మ్యాచ్ జరుగుతోంది. కొత్త బంతిని పాతదిగా మార్చేస్తే రోహిత్ దగ్గర క్రెడిట్ కొట్టేయొచ్చని నేను భావించా. మైదానంలో తేమ ఉండడంతో బంతిని నేరుగా ఇవ్వకుండా.. గడ్డిపై నుంచి రోహిత్ వద్దకు పంపించా.
దీంతో నావైపు రోహిత్ ఆగ్రహంగా చూశాడు. బంతిని టవల్ తో తుడుస్తూ నన్ను తిట్టాడు. నేను నా తల కిందకు వంచుకుని నిలబడిపోయాను. ఆ వెంటనే మళ్లీ నా దగ్గరకు వచ్చి సారీ చెప్పాడు. ఇదంతా మ్యాచ్ లో ఒత్తిడి వల్లే జరిగిందని, మనసులో పెట్టుకోవద్దని ఓదార్చాడు’’ అని ఇషాన్ పేర్కొన్నాడు.
ఆట అయ్యాక మైదానం వెలుపల అందరితోనూ రోహిత్ చాలా సరదాగా ఉంటాడని వ్యాఖ్యానించాడు. రాహుల్ చాహర్ బౌలర్ గా పరిణతి సాధించాడంటే దానికి కారణం రోహితేనని తెలిపాడు. రాహుల్ సక్సెస్ లో రోహిత్ పాత్ర చాలా ఎక్కువన్నాడు. ఆటగాళ్లపై ఎంతో నమ్మకంగా ఉంటాడని పేర్కొన్నాడు. ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసం నింపుతాడని చెప్పాడు.
కీపింగ్ కన్నా ఎక్కువగా.. ధోనీ ఎలా ఆలోచిస్తాడన్న దానిపైనే తాను ఫోకస్ పెడతానని చెప్పాడు. ఓసారి చెన్నైతో జరిగిన మ్యాచ్ లో తాను ఔటైనప్పుడు జరిగిన ఘటనను గుర్తు చేశాడు. తాను బౌలర్లందరినీ బాదేస్తూ క్రీజులో కుదురుకున్నానని, కానీ, ఇంతలో ధోనీ భాయ్ వచ్చి ఇమ్రాన్ తాహిర్ కు చెవిలో ఏదో చెప్పాడని పేర్కొన్నాడు. అతడేం చెప్పాడో తనకు తెలియదని, కానీ, ఆ వెంటనే తాను థర్డ్ మ్యాన్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యానని తెలిపాడు. ఆటగాళ్ల మెదడును ధోనీ ఇట్టే ఎలా పసిగట్టేస్తాడో, తాను ఔటయ్యేందుకు ధోనీ ఏం చెప్పాడోనన్న విషయాన్ని ఇప్పటికీ తాను తేల్చలేకపోయానని పేర్కొన్నాడు.