నమ్మిన సిద్ధాంతం కోసం చావుకైనా వెనుకాడం: సంజయ్
- బీజేపీ స్థాపన దివస్ సందర్భంగా వ్యాఖ్యలు
- పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరణ
- భారత్ ను విశ్వగురువుగా నిలిపే లక్ష్యంతోనే పార్టీ పనిచేస్తుందని వెల్లడి
- దేశానికి బీజేపీనే శ్రీరామరక్ష అంటూ కామెంట్
దేశంలో ఇప్పటిదాకా ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టాయని, కానీ, బీజేపీ అవసరం ఇంకా ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం చావుకైనా వెనుకాడని పార్టీ అని, అధికారం కన్నా సిద్ధాంతమే ముఖ్యమని నమ్మి ఆచరిస్తున్న పార్టీ బీజేపీ అని చెప్పారు.
ఇవాళ బీజేపీ స్థాపన దివస్ సందర్భంగా ఆయన.. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్, డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీలకు నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రపంచానికి భారతీయ జీవన గమనమే ఉత్తమమని చాటిచెబుతూ భారత్ ను విశ్వగురువుగా నిలిపే లక్ష్యంతో పనిచేస్తున్న ఏకైక పార్టీ బీజేపీనేనని, భారత్ కు బీజేపీనే శ్రీరామరక్ష అని అన్నారు. ఇంత గొప్ప పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగడం తన పూర్వజన్మ సుకృతమన్నారు.
తెలంగాణలో అధికారంలో లేకపోయినా కార్యకర్తల త్యాగాల పునాదులపై నిలదొక్కుకున్న పార్టీ అన్నారు. టీఆర్ఎస్ అరాచక పాలనను అంతమొందించి గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించడమే తమ ధ్యేయమన్నారు. టీఆర్ఎస్ అవినీతి, కుటుంబ, నియంత పాలనను ఎండగట్టేందుకు బీజేపీ కార్యకర్తలు గడపగడపకూ వెళ్లి ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు.