నెలవారీ ప్లాన్ కోసం ఆరు ప్రీపెయిడ్ ప్యాక్ లు.. వివరాలు ఇవిగో

  • జియో, వొడాఫోన్ ఐడియా నుంచి నెలవారీ ప్లాన్లు
  • 30 రోజులతో ఒక్కో ప్లాన్ ఆవిష్కరణ
  • నెలవారీ ప్లాన్ ప్రకటించని ఎయిర్ టెల్
  • 30 రోజుల వ్యాలిడిటీతో రెండు ప్యాక్ లు
మొబైల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ అయితే నెలవారీగా అమలవుతుంది. కానీ ప్రీపెయిడ్ కు వచ్చే సరికి కంపెనీలు అదనపు ఆదాయం కోసం తెలివిగా 28 రోజులకే పరిమితం చేశాయి. దీంతో చాలా ఏళ్ల తర్వాత టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) స్పందించి.. నెలవారీ ప్లాన్ ను కనీసం ఒకటైనా అందించాలని, అలాగే 30 రోజుల ప్లాన్ ను కూడా ఒకదానిని ప్రవేశపెట్టాలని టెలికం కంపెనీలను ఆదేశించింది. దీంతో కంపెనీలు నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ లను ప్రకటించాయి.

రిలయన్స్ జియో రూ.256
నెలకు ఒకసారి ఈ ప్లాన్ ను రీచార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు ఏప్రిల్ 6న రీచార్జ్ చేసుకున్నారనుకోండి. ప్లాన్ కాల వ్యవధి మే 5 వరకు అమల్లో ఉంటుంది. మళ్లీ 6వ తేదీ ఉదయం రీచార్జ్ చేసుకుంటే సరిపోతుంది. రోజువారీ 1.5 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్ లు, అపరిమిత వాయిస్ కాల్స్ ఫీచర్లు ఇందులో లభిస్తాయి.

జియో రూ.296
ఈ ప్యాక్ లో రోజువారీగా 100 ఎస్ఎంఎస్ లు, ఉచిత వాయిస్ కాల్స్ ను వినియోగించుకోవచ్చు. 25జీబీ డేటా లభిస్తుంది. వ్యాలిడిటీ 30 రోజులు.

వీఐ రూ.337 ప్లాన్
ఇది నెలవారీ కాల వ్యవధితో వస్తుంది. అన్ లిమిటెడ్ కాలింగ్, రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్ లు, 28జీబీ డేటా లభిస్తుంది. డేటాకు రోజువారీ పరిమితి ఉండదు. నెల రోజుల వ్యవధిలో ఎప్పుడైనా ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. 

వీఐ రూ.327 ప్లాన్
ఇది 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో 25జీబీ డేటా లభిస్తుంది. అలాగే అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, రోజువారీ 100 ఉచిత ఎస్ఎంఎస్ లు పొందొచ్చు. 

ఎయిర్ టెల్ రూ.319.. 
మిగిలిన రెండు సంస్థల మాదిరి నెలవారీ ప్లాన్ ను ఎయిర్ టెల్ ప్రకటించలేదు. 30 రోజల కాల వ్యవధితో ఉండే రెండు ప్యాక్ లను ప్రవేశపెట్టింది. రూ.319 ప్లాన్ కాల వ్యవధి 30 రోజులు రోజువారీగా 2జీబీ ఉచిత డేటా, 100 ఎస్ఎంఎస్ లు, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఎంఈని నెల రోజులకు ఉచితంగా అందిస్తోంది. 

ఎయిర్ టెల్ రూ.296
ఇది కూడా 30 రోజుల కాల వ్యవధితోనే వస్తుంది. ఇందులో 25 జీడీ డేటాతోపాటు ఉచిత కాల్స్, రోజువారీ 100 ఉచిత ఎస్ఎంఎస్ లు పొందొచ్చు.



More Telugu News