ఏం తమాషాలు చేస్తున్నారా?.. తెల్లవారుజామున పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్ రుబాబు.. ఇదిగో వీడియో

  • హోటళ్లను పోలీసులు మూసేయిస్తుండగా ఘటన
  • రంజాన్ టైంలో తెల్లార్లూ తెరచే ఉంటాయన్న గౌసుద్దీన్
  • రూ.100 తీసుకునే నువ్వూ నన్ను ఎదిరిస్తావా? అంటూ కానిస్టేబుల్ పై హేళన 
పోలీసులపై అర్ధరాత్రి ఓ కార్పొరేటర్ రుబాబు చేశారు. నిన్న అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత కూడా తెరచి ఉంచిన హోటళ్లను మూసేయిస్తున్న పోలీసులపై భోలక్ పూర్ ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ హల్ చల్ చేశారు. బెదిరింపులకు పాల్పడ్డారు. హైదరాబాద్ లోని భోలక్ పూర్ డివిజన్ లో జరిగిందీ ఘటన. 

రంజాన్ మాసంలో హోటళ్లు తెల్లవార్లూ తెరచే ఉంటాయని తేల్చి చెప్పారు. పోలీసులు తమాషాలు చేస్తున్నారంటూ నోరు పారేసుకున్నారు. వచ్చినవాళ్లు డ్యూటీ చేసుకుని వెళ్లిపోవాలంటూ పోలీసులను హెచ్చరించారు. తమ డ్యూటీని తాము చేస్తున్నామని ఓ కానిస్టేబుల్ అనగా.. ‘‘రూ.100 తీసుకునేవాడివి నాకే ఎదురు చెబుతావా?’’ అంటూ అవమానకరంగా మాట్లాడారు. 

కార్పొరేటర్ వచ్చాడని ఎస్సైకి చెప్పి పిలిపించాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ వ్యవహారంపై ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వివరాలు తెలుసుకున్నట్టు తెలుస్తోంది.


More Telugu News