తెలంగాణలోని జాతీయ రహదారులపై టీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలు.. భారీగా ట్రాఫిక్ జామ్
- కేంద్ర సర్కారు ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ నిరసనలు
- జాతీయ రహదారులపై బైఠాయించిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు
- మహబూబ్ నగర్ భూత్పూర్ వద్ద నిరసనలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నేడు తెలంగాణలోని జాతీయ రహదారులపై రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు.
దీంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. రహదారులపై టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బైఠాయిస్తున్నారు. మహబూబ్ నగర్ భూత్పూర్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఇందులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అలాగే, మేడ్చల్ లో ముంబై జాతీయ రహదారిపై టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు.
దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. టీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు. వాహనాల రాకపోకలకు ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసేలా రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని, లేదంటే వారిని తెలంగాణలోని గ్రామాల్లో తిరగనివ్వబోమని టీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.
యాసంగి వడ్లను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా పాల్గొన్నారు.