మంత్రిగా రేపే లాస్ట్ వర్కింగ్ డే.. ఏపీ మంత్రి పేర్ని నాని
- టీవీ లైవ్ డిబేట్‌లో పాల్గొన్న పేర్ని నాని
- పార్టీ పదవులు అప్పగిస్తారేమోనని వ్యాఖ్య
- మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై క్లారిటీ వచ్చినట్టేనన్న విశ్లేషణలు
ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఆ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని (పేర్ని వెంకట్రామయ్య) మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రేపే తనకు మంత్రిగా లాస్ట్ వర్కింగ్ డే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌లో నిర్వహించిన లైవ్ డిబేట్‌లో పాలుపంచుకున్న సందర్భంగా పేర్ని నాని ఈ వ్యాఖ్య చేశారు.
మంత్రిగా తనకు బుధవారమే లాస్ట్ వర్కింగ్ డే అంటూ కామెంట్ చేసిన మంత్రి పేర్ని నాని.. ఇకపై తనకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారేమోనని వ్యాఖ్యానించారు. ఈ నెల 7న కేబినెట్ సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. అందులోనే మంత్రులతో సీఎం జగన్ రాజీనామాలు చేయించనున్నట్లుగా పేర్ని నాని చెప్పారన్న వాదనలు వినిపిస్తున్నాయి.