రేపు బీజేపీ వ్య‌వ‌స్థాప‌క దినం..ఘ‌నంగా నిర్వ‌హ‌ణ‌కు మోదీ ఆదేశం

  • 14 రోజుల పాటు కార్య‌క్ర‌మాలు
  • సామాజిక న్యాయ్ పఖ్వాడా పేరిట కార్య‌క్ర‌మాలు
  • ఎంపీలు పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొనాల‌ని మోదీ దిశానిర్దేశం
  • ప్ర‌జ‌ల్లోకి వెళ్లి కేంద్ర ప‌థ‌కాల‌ను తీసుకెళ్లాల‌ని ఆదేశం
కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) త‌న వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాల‌కు సిద్ధమైపోయింది. ఈ నెల 6 (బుధ‌వారం)న పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించేందుకు పార్టీ శ్రేణుల‌కు పార్టీ జాతీయ నాయ‌క‌త్వం దిశానిర్దేశం చేసింది. ఈ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి మంగ‌ళ‌వారం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పార్టీ ఎంపీల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు.

ఈ సంద‌ర్భంగా పార్టీ ఎంపీల‌కు మోదీ ప‌లు సూచ‌న‌లు చేశారు. ఎంపీలు పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాలు పంచుకోవాల‌ని సూచించిన మోదీ.. కేంద్ర ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని దిశానిర్దేశం చేశారు. పార్టీ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్భంగా 14 రోజుల పాటు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్న మోదీ.. ఈ కార్య‌క్ర‌మాల‌ను సామాజిక న్యాయ్ ప‌ఖ్వాడ పేరిట జ‌ర‌ప‌నున్న‌ట్లు తెలిపారు.


More Telugu News