కన్నీళ్లు ఆగడంలేదు అమ్మా... ఈ లోకంలో లేని తల్లి కోసం ఏపీ డిప్యూటీ సీఎం అశ్రు నివాళి
- మూడేళ్ల కిందట పుష్ప శ్రీవాణికి మాతృవియోగం
- ఇప్పటికీ వేదనలో డిప్యూటీ సీఎం
- దేవుడికి దయ లేదంటూ వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి మూడేళ్ల కిందట తల్లిని కోల్పోయారు. ఇప్పటికీ తాను మాతృమూర్తి జ్ఞాపకాలతో తీవ్ర వేదనకు గురవుతున్నానని తాజాగా పుష్ప శ్రీవాణి సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ మేరకు తల్లికి కన్నీటి నివాళి అర్పించారు.
"అమ్మా... నీ స్పర్శ నాకు దూరమై మూడు సంవత్సరాలు గడిచిపోయింది. అమ్మా... మా కోసం మళ్లీ వచ్చేయ్ అమ్మా! ఎన్ని ఉన్నా నాకు నువ్వు లేవు అని గుర్తొస్తే కన్నీళ్లు ఆగడంలేదు. ఆ దేవుడు కూడా మాకోసం ఆలోచించలేదు. నువ్వు లేకపోతే ఉండలేం అని తెలిసి కూడా దూరం చేశాడు. ఆ భగవంతుడికి బహుశా మమ్మల్ని చూసి జాలి కలగలేదేమో! నువ్వు ఎక్కడ ఉన్నా నీ ఆశీర్వాదాలు మాపై ఉంటాయని నమ్ముతున్నాను... నీ వాణమ్మ" అంటూ బరువెక్కిన హృదయంతో ట్వీట్ చేశారు. ఈ మేరకు తన తల్లితో కలిసున్న ఫొటోను కూడా పుష్ప శ్రీవాణి పంచుకున్నారు.
.