డ్ర‌గ్స్ కేసులో కీల‌క నిందితుడు లక్ష్మీప‌తి అరెస్ట్‌

  • బీటెక్ విద్యార్థి మృతిలో ల‌క్ష్మీప‌తి కీల‌క నిందితుడు
  • సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే ల‌క్ష్యంగా ల‌క్ష్మీప‌తి డ్ర‌గ్స్ దందా
  • వారం రోజులుగా ప‌రారీలో ఉన్న నిందితుడు
డ్ర‌గ్స్ అధిక మోతాదులో వాడిన కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన ఇంజినీరింగ్ విద్యార్థి ఘ‌ట‌న‌కు సంబంధించి కీల‌క నిందితుడు ల‌క్ష్మీప‌తిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజులుగా పరారీలో ఉన్న ల‌క్ష్మీప‌తి చివరికి మంగ‌ళవారం పోలీసులకు చిక్కాడు. లక్ష్మీపతికి హైదరాబాద్‌లో భారీ నెట్‌వర్క్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఇంజనీరింగ్ విద్యార్థులే టార్గెట్‌గా లక్ష్మీపతి డ్రగ్స్ దందా చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

స్నాప్‌చాట్, టెలిగ్రామ్‌, ఇన్‌స్టా వంటి సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫాం ద్వారా సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులకు ల‌క్ష్మీప‌తి వల వేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గోవా నుంచి హైదరాబాద్ కు అతను డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. లీటర్‌ హాష్‌ ఆయిల్‌ను రూ.6 లక్షలకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. డ్రగ్స్‌ దందాలో లక్ష్మీపతి నెట్‌వర్క్‌లో 100 మందికి పైగా వినియోగదారులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్‌లలో లక్ష్మీపతిపై కేసులు నమోదయ్యాయి.


More Telugu News