శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ ఆస్తుల‌ను సీజ్ చేసిన ఈడీ

  • శివ‌సేన ఎంపీగా, సామ్నా ఎడిట‌ర్‌గా రౌత్‌కు గుర్తింపు
  • పాత్ర ఛాల్ భూ కుంభ‌కోణంలో రౌత్‌పై ఆరోప‌ణ‌లు
  • రెండు ప్లాట్ల‌ను అటాచ్ చేస్తూ ఈడీ కీల‌క నిర్ణ‌యం
  • భ‌య‌ప‌డేది లేదంటూ రౌత్ కామెంట్‌
మ‌హారాష్ట్రలో అధికార పార్టీ శివ‌సేన‌కు చెందిన ఎంపీ, ఆ పార్టీ ప‌త్రిక సామ్నా ఎడిట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంజ‌య్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) మంగ‌ళ‌వారం షాకిచ్చింది. గ‌తంలో వెలుగు చూసిన పాత్ర ఛాల్ భూ కుంభ‌కోణంలో రౌత్ పాత్రపై ఆరోప‌ణ‌లు వినిపించాయి. ఈ ఆరోప‌ణ‌ల ఆధారంగా రౌత్‌కు చెందిన స్థిరాస్తుల‌ను ఈడీ అటాచ్ చేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 

పాత్ర ఛాల్ భూ కుంభ‌కోణంలో రూ.1,034 కోట్ల మేర అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ గ‌తంలో ఆరోప‌ణ‌లు వినిపించాయి. ఈ కేసు ద‌ర్యాప్తును చేప‌ట్టిన ఈడీ.. తాజాగా రౌత్‌కు చెందిన స్థిరాస్తుల‌ను అటాచ్ చేసింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో రౌత్‌కు చెందిన‌ ముంబైలోని అలీబాగ్‌, దాద‌ర్‌ల‌లోని ఒక్కో ప్లాట్ ఉన్నాయి. ఈడీ అటాచ్‌పై స్పందించిన రౌత్‌.. ఈ త‌రహా బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని అన్నారు. ఆస్తుల‌ను సీజ్ చేసినా, కాల్చివేసినా, జైలుకు పంపినా కూడా భ‌య‌ప‌డేది లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.


More Telugu News