పోలవ‌రం నిర్మాణ బాధ్య‌త‌లు కేంద్రమే చేప‌ట్టాలి: సుజ‌నా చౌద‌రి

  • పోల‌వ‌రం ఏపీకి జీవ‌నాడి అన్న సుజనా 
  • రాష్ట్ర విభ‌జ‌న‌తో జాతీయ ప్రాజెక్టుగా పోల‌వ‌రం
  • ప్రాజెక్టు ఆల‌స్య‌మైతే ఏపీకి తీవ్ర న‌ష్టమంటూ వ్యాఖ్యలు 
ఏపీకి జీవ‌నాడిగా ప‌రిగ‌ణిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి బీజేపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి కొత్త ప్ర‌తిపాద‌న చేశారు. ఈ మేర‌కు పార్ల‌మెంటు బ‌డ్జెట్ మ‌లి విడ‌త స‌మావేశాల్లో భాగంగా మంగ‌ళ‌వారం నాడు రాజ్య‌స‌భ‌లో పోల‌వ‌రం అంశాన్ని ప్ర‌స్తావించిన సుజ‌నా చౌద‌రి.. ప్రాజెక్టు నిర్మాణ బాధ్య‌త‌ల‌ను కేంద్ర‌మే చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. ఈ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వంతో సంబంధం లేకుండానే కేంద్రం ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టాల‌ని ఆయ‌న కోరారు.

పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి వంటిదన్న సుజ‌నా.. రాష్ట్ర విభజన సందర్భంగా దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన విష‌యాన్ని స‌భ‌లో గుర్తు చేశారు. పోలవరం ఆలస్యమైతే ఏపీ తీవ్రంగా నష్టపోతుందని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ కార‌ణంగానే రాష్ట్రంతో సంబంధం లేకుండా కేంద్రమే ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చేపట్టాలని ఆయ‌న కోరారు.



More Telugu News