పబ్ కేసులో నా వాళ్లున్నా శిక్షించండి... చిన్నపిల్లలను అడ్డంపెట్టుకుని చిల్లర రాజకీయాలొద్దు: రేవంత్ రెడ్డి
- బంజారాహిల్స్ పబ్ డ్రగ్స్ వ్యవహారంలో పరస్పర ఆరోపణలు
- మా బంధువుల పిల్లలందరికీ డ్రగ్స్ టెస్టులు చేయిస్తానన్న రేవంత్
- కేటీఆర్ ను డ్రగ్స్ టెస్టుకు పంపగలరా? అంటూ సవాల్
- పబ్ లో దొరికిన 125 మందికి ఎందుకు టెస్టులు చేయలేదని ప్రశ్న
రాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో పోలీసుల దాడుల వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ కేసులో తన సమీప బంధువు ఉన్నాడంటూ టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండడం పట్ల రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
తన బంధువర్గంలోని పిల్లలను ఏ ఆసుపత్రికైనా తీసుకువస్తానని, అందరికీ డ్రగ్స్ టెస్టులు చేయిస్తానని అన్నారు. మరి, కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ ను కూడా డ్రగ్స్ టెస్టుకు పంపగలరా? అంటూ సవాల్ విసిరారు. పబ్ కేసులో తన వాళ్లు ఉంటే శిక్షించాలని, అంతేతప్ప చిన్నపిల్లలను అడ్డంపెట్టుకుని చిల్లర రాజకీయాలు చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ అంశంలో తాను నైతిక బాధ్యతతో వ్యవహరిస్తున్నానని, టీఆర్ఎస్ ప్రభుత్వమే తమకు కావలసిన వాళ్లు ఉన్నారని అందరినీ వదిలేసిందని రేవంత్ ఆరోపించారు. అసలు, ఆ పబ్ 24 గంటలూ నడిచేందుకు అనుమతి ఇచ్చింది ఎవరని ప్రశ్నించారు. పబ్ లో దొరికిన 125 మందికి ఎందుకు టెస్టులు చేయలేదు? వారిని ఎందుకు వదిలేశారు? అని ప్రశ్నించారు.