‘నెయిల్ ఫైల్స్' అనే పేరు పెడతా .. ట్వింకిల్ ఖన్నా వ్యంగ్యం
- కశ్మీర్ ఫైల్స్ క్రేజ్ గురించి ఓ నిర్మాత చెప్పారన్న ట్వింకిల్
- నేనూ మానిక్యూర్ పై సినిమా తీస్తానని వ్యాఖ్య
- కశ్మీర్ ఫైల్స్ స్ఫూర్తిగా పేర్లు పెట్టడంపై ఫైర్ అయిన అక్షయ్ భార్య
బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ను అందుకున్న కశ్మీర్ ఫైల్స్ సినిమాపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా వెటకారంగా స్పందించింది. ఆ సినిమా క్రేజ్ పై ఆమె ఓ ఆర్టికల్ రాసింది.
తాను కూడా మానిక్యూర్ (గోళ్లను శుభ్రం చేసే పని)పై ఓ సినిమా తీస్తానని, దానికి ‘నెయిల్ ఫైల్స్’ అనే పేరును పెడతానని వ్యంగ్యాస్త్రం విసిరింది. ఓ ప్రొడ్యూసర్ తో సమావేశం సందర్భంగా ఆయన కశ్మీర్ ఫైల్స్ క్రేజ్ ను చెప్పారని గుర్తు చేసింది. కశ్మీర్ ఫైల్స్ స్ఫూర్తితో చాలా మంది ‘అంధేరీ ఫైల్స్’, ‘ఖర్ దందా ఫైల్స్’, ‘సౌత్ బాంబే ఫైల్స్’ వంటి పేర్లను నమోదు చేస్తున్నారంటూ ఆ నిర్మాత చెప్పారని ఆమె పేర్కొంది.
ఇలాంటి వాళ్లందరినీ సినీ దర్శకులు అనాలా? అంటూ వ్యాఖ్యానించింది. తాను నేషనలిస్ట్ అని చెప్పుకునే మనోజ్ కుమార్ లాగే అందరూ క్లర్కులుగా మారుతారా? అంటూ ఎద్దేవా చేసింది. కశ్మీరీ పండిట్లకు జరిగిన అకృత్యాలు, అరాచకాలపై వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్ లో కశ్మీర్ ఫైల్స్ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సినిమాలో అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించారు.