ఆ ఐపీఎల్ జట్టులో ఏదో లోపం ఉంది: పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్
- పిచ్ ఏదైనా సన్ రైజర్స్ తలరాత మారడం లేదు
- బ్యాటింగ్ ఆర్డర్ లో మార్ క్రమ్ ముందు రావాలి
- ప్రభావం చూపించగల ఆటగాడన్న సల్మాన్ భట్
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రదర్శనపై పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ అనుమానాలు వ్యక్తం చేశాడు. ఏదో తెలియని లోపం ఆ జట్టును వేధిస్తోందన్నాడు. ఐపీఎల్ తాజా సీజన్ లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ సన్ రైజర్స్ జట్టు ఓడిపోయిన నేపథ్యంలో భట్ ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం.
‘‘ఎస్ఆర్ హెచ్ టైమ్ మారడం లేదు. అది మంచి పిచ్ అయినా, చెత్త పిచ్ అయినా కానీ వారి తలరాత కూడా మారడం లేదు. కనుక ఈ జట్టులో ఏదో లోపం ఉంది’’ అని సల్మాన్ భట్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. జట్టులో ఏడెన్ మార్ క్రమ్ పాత్ర పట్ల కూడా భట్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
‘‘మార్ క్రమ్ బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు రావాలి. అతడు ప్రభావం చూపించగల ఆటగాడు. కానీ 4 లేదా 5వ స్థానంలో ఆడిస్తున్నారు. టాప్ ఆర్డర్ లో పంపించాల్సిన వ్యక్తి. ప్రస్తుత ఆర్డర్ వల్ల చాలా మ్యాచుల్లో అతడు పెద్దగా స్కోరు చేయలేడు’’ అని భట్ పేర్కొన్నాడు. సోమవారం నాటి మ్యాచులో 27 పరుగులకే 3 వికెట్లు తీసి లక్నో జట్టును కష్టాల్లోకి నెట్టిన సన్ రైజర్స్ ఆ తర్వాత పెద్దగా కట్టడి చేయలేకపోయింది. బ్యాటింగ్ లోనూ వైఫల్యంతో గెలవాల్సిన మ్యాచులో చేతులెత్తేసింది.